స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -772 లో... జగతి ఎలాగైనా రిషిని కాపాడుకోవాలని అనుకుంటుంది. వసుధారని మిషన్ ఎడ్యుకేషన్ ఫండ్స్ రిషి మెడికల్ కాలేజీకి ఉపయోగించుకుంటున్నాడని అబద్దం చెప్పమని అడుగుతుంది జగతి. దానికి వసుధార ఒప్పుకోదు. రిషి సర్ ని మోసం చెయ్యలేను.. కావాలంటే నా ప్రాణాలు అడగండి లేదా ఇంట్లో నుండి వెళ్ళమని చెప్పండి. అంతేకాని రిషి సర్ ని మోసం చెయ్యలేను.. ప్లీజ్ మేడం అని వసుధార రిక్వెస్ట్ చేస్తుంది.
జగతి ఎంత చెప్పినా వసుధార వినదు. నేను రిషి సర్ ని మోసం చెయ్యలేనంటూ ఏడుస్తుంది. నా కొడుకుకి ప్రాణభిక్ష పెట్టు వసుధార.. రిషి కాలేజీ నుండి వదిలి వెళ్ళిపోవాలి. లేదంటే శైలేంద్ర బ్రతుకనివ్వడని జగతి బతిమిలాడుతుంది. ఇక చేసేదేమీ లేక అబద్ధం చెప్తానని వసుధార అంటుంది. ఆ తర్వాత రిషికి వసుధర మెసేజ్ చేసి రమ్మంటుంది. వసుధార క్యాబిన్ కి వెళ్లగానే రిషిని హాగ్ చేసుకొని ఏడుస్తుంది వసుధాత. ఏమైంది వసుధార ఎందుకు ఏడుస్తున్నావ్? నువ్వు ఇలా ఏడుస్తుంటే నా గుండె బరువెక్కుతుంది. ప్లీజ్ ఏడవకని రిషి అంటాడు. నా మనసు ఎందుకో ఆందోళనగా ఉంది సర్ అని వసుధార అంటుంది. ఏం ఆలోచించకు అని వసుధారని ఓదార్చుతాడు రిషి.
ఆ తర్వాత కాలేజీ కి సంబంధించిన మీటింగ్ జరుగుతుంటే అందరు కూర్చొని ఉంటారు. అప్పుడే రిషి, వసుధారలు లోపలికి వెళ్తారు. ఏంటి ఇంకా ప్రెస్ వాళ్ళు రాలేదా అని రిషి అడుగుతాడు. ప్రెస్ మీట్ కంటే ముందు ఒక విషయం తెలియాలని జగతి అంటుంది. నీపై ఒక అభియోగం వచ్చిందని జగతి అనగానే.. రిషి షాక్ అవుతాడు. నా కాలేజీలో నాపై అభియోగమేంటని రిషి అడుగుతాడు. మిషన్ ఎడ్యుకేషన్ ఫండ్స్ మెడికల్ కాలేజీకి ఉపయోగిస్తున్నావనే అభియోగం వచ్చిందని జగతి అంటుంది. ఎవరన్నారని రిషి అడుగుతాడు. మీరే కదా సర్ నాకు ఇచ్చారని అక్కడే ఉన్న సారథి అంటాడు. మీరు గవర్నమెంట్ ఫండ్ మీ కాలేజీ కి ఉపయోగిస్తున్నారని ఆ చెక్ ని మినిస్టర్ గారికి నేనే ఇచ్చానని సారథి అంటాడు.
లేదు ఇదంతా మోసం.. అసలు అతనికి నేను ఎలాంటి చెక్ ఇవ్వలేదని రిషి అంటాడు. అప్పుడు జగతి సాక్ష్యం ఉందంటూ చెక్ ని చూపిస్తుంది. ఇందులో మీ ఇద్దరి సంతకాలు ఉన్నాయని జగతి అంటుంది. మిషన్ ఎడ్యుకేషన్ చెక్ పవర్ నీకు వసుధరకి మాత్రమే ఉందని మినిస్టర్ అంటాడు. ఆ తర్వాత అది మనం ఇచ్చామా వసుధార అని రిషి అడుగుతాడు. మరి వసుధార అవునని సమాధానం చెప్తుందా? కాదని చెప్తుందా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.